మా ఆయన బంగారం.. దాచుకున్నా .. విడిపోలేదు: స్వాతి

by Shyam |
మా ఆయన బంగారం.. దాచుకున్నా .. విడిపోలేదు: స్వాతి
X

కలర్స్ స్వాతి… కలర్స్ ప్రోగ్రాంతో తెలుగు ప్రజల మనసు దోచుకున్న స్వాతి… అష్టా చమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ మంచి సినిమాలు, గుర్తుండి పోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించే ఈ జంట విడిపోయారని పుకార్లు షికారు చేశాయి. కారణం స్వాతి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి భర్తతో ఉన్న ఫోటోలు తొలగించడమే. ఇంతకు ముందు ఇలియానా లాంటి హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించి…తద్వారా మా ఇద్దరి మధ్య బ్రేక్ అప్ అయిందనే మెసేజ్ ఇచ్చారు. అదే కోవలోకి స్వాతి కూడా చేరిందనుకున్నా.. అలాంటిదేమీ జరగలేదని, జరగబోదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. నా భర్త నాకు చాలా స్పెషల్ అని… ఆయనతో ఉన్న ఫోటోలను దాచుకున్నాను అని చెప్పింది. ఇన్ స్టాలోని ఆర్కివ్ లో దాచుకున్న విషయాన్ని చూపిస్తూ… ఓ వీడియో తీసి మరి ఆర్కివ్ లో దాచుకున్న ఫోటోలు చూపించింది. అసలు అక్కడ ఎందుకు దాచుకున్నాను అనే విషయాన్ని వివరిస్తూ.. హ్యారిపోటర్ లోని ఓ డైలాగ్ ను వీడియో కింద యాడ్ చేసి మరీ పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మా స్వాతి అలాంటి పిచ్చి పనులు చేయడమా… అసలు జరగదు అని మురిసిపోతున్నారు.


Tags: Swathi, Colors Swathi, Tollywood, Kollywood, marriage, clarity

Advertisement

Next Story

Most Viewed