ఆ స్కూటర్ ధర పెంచిన సుజుకి మోటార్స్ ఇండియా!

by Harish |
Suzuki-motors
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్స్ ఇండియా తన బర్గ్‌మన్ 125సీసీ స్కూటర్ ధరను పెంచింది. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ వేరియంట్ రెండింటి ధరలను రూ. 1,600 పెంచినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పెంచిన తర్వాత బర్గ్‌మన్ స్టాండర్డ్ వేరియంట్ స్కూటర్ ధర రూ. 84,300(ఎక్స్‌షోరూమ్) ఉండగా, స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ. 87,800(ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. పెంచిన ధరల నేపథ్యమ్ళో 125సీసీ స్కూటర్ విభాగంలో అధిక ధరకు లభిస్తున్న వాహనంగా సుజుకి బర్గ్‌మన్ నిలిచింది.

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగానే బర్గ్‌మన్ స్కూటర్ ధరను పెంచినట్టు కంపెనీ వివరించింది. కాగా, సుజుకి బర్గ్‌మన్ స్కూటర్ మ్యాక్సీ స్కూటర్ బర్గ్‌మన్ 124సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చినట్టు కంపెనీ తెలిపింది. స్ట్రీడ్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ వేరియంట్‌లో బ్లూటూత్, కాల్స్, మెసేజ్, వాట్సాప్ అలర్ట్ లాంటి అధునాతన సాంకేతికతను వినియోగించే సౌకర్యాలున్నాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed