- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
X
దిశ, కుత్బుల్లాపూర్ : అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చంద్రిక(21) బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా గల కృప హాస్టల్‌లో ఉంటుంది. రోజు మాదిరిగానే రాత్రి అందరితో సహా భోజనం చేసింది. ఏమైందో ఏమో గాని మంగళవారం ఉదయం హాస్టల్ బిల్డింగ్ పక్కన గల ఖాళీ స్థలంలో మృతిచెందడం కలకలం సృష్టించింది.
విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేష్‌లు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా కావాలని హత్య చేసి ఇక్కడ పడేశారా..? మారేమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story