వ్యక్తి అనుమానాస్పద మృతి 

by Shyam |
వ్యక్తి అనుమానాస్పద మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ వర్ని మండల పరిధిలోని బడాపహాడ్‌ అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చిని భావిస్తున్నారు. మృతుడిని బోధన్‌ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన రాజన్న (55)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుమార్తె వివాహం అనంతరం బతుకుదెరువు కోసం ఆర్మూర్‌ వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం బడాపహాడ్‌ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి వచ్చాడు. సాయంత్రం అటవీ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని ఎస్సై అనిల్ ‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story