యువతి మృతి… తండ్రిపై అనుమానం

by Anukaran |
యువతి మృతి… తండ్రిపై అనుమానం
X

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా రూరల్ మండలం జలగంనగర్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. స్థానిక ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న మెరుగు దుర్గారావు పెద్ద కుమార్తె మాధురి( 22 ) ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సంబంధాలు చూస్తుండగా యువతి నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై గురువారం అర్ధరాత్రి కత్తితో మెడకోసుకొని ఆత్మహత్య చేసుకుందని మాధురి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మరోవైపు కూతురి ప్రేమ వ్యవహారం సహించలేక కన్నతండ్రే హత్య చేశాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూతురి మృతి విషయం ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కాగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story