రైతుల వద్దకే మిల్లర్లు, ట్రేడర్లు

by Shyam |
రైతుల వద్దకే మిల్లర్లు, ట్రేడర్లు
X

దిశ, న‌ల్ల‌గొండ‌: మిల్లర్లు, ట్రేడర్లు రైతుల వద్దకే వెళ్లి పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం ధాన్యం నిల్వ, విక్రయాలపై సంబంధిత అధికారులు, మిల్లర్లు, ట్రేడర్‌లతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ డి.సంజీవ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. పంటకు మద్దతు ధర కల్పించాలని ఆదేశించారు. రైతుల వద్ద ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యం, రబీలో పండించిన ధాన్యాన్ని అంచనా వేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం తరుఫున గ్రామాల్లోనే ఐకేపీ 203, పీఏసీఎస్ ద్వారా 103 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు రజాక్, యస్. ఒ. విజయలక్ష్మి, డి.యం. పుల్లయ్య, ఏడీఏ జ్యోతిర్మయి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: suryapeta, collector vinay krishna reddy, millars, traders, farmers, crop

Advertisement

Next Story

Most Viewed