సూర్యాపేటకు భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం

by Shyam |
సూర్యాపేటకు భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద 300 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మెక్వెల్ కంపెనీ ప్రతిపాదించింది. 150 మెగావాట్ల రెండు యూనిట్లతో ఉన్న ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రకారం 332 ఎకరాల్లో దీన్ని రూ. 2,160 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ డీపీఆర్‌ను రాష్ట్ర స్థాయి పర్యావరణ ఎసెసెమెంట్ (ప్రభావ మదింపు) అథారిటీకి సమర్పించారు. దీన్ని పర్యావరణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద నున్న 220 కేవీఏ ట్రాన్స్‌ఫార్మార్ ద్వారా ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి దశ ప్రాజెక్టును అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే పూర్తి చేస్తారు. రెండో దశను మూడు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 12 నిర్మాణ, సాంకేతిక ఒప్పందాలు ఉంటాయని సమాచారం. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్‌ను ఏడాదికి 6 శాతంగా లెక్కించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

ఈ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి, అంతర్జాతీయ బొగ్గు అమ్మకందార్ల నుంచి ఏడాదికి 2.01 మిలియన్ టన్నుల బొగ్గును కొనుగోలు చేయనున్నారు. ఈ బొగ్గు రవాణాకు సింగరేణి నుంచి మేళ్లచెర్వు రైల్వేస్టేషన్ ద్వారా ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయాల్సి ఉంది. ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు తొలి ఏడాది‌లో కిలో వాట్‌కు రూ.4.82 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నిర్వహణ ఖర్చు రూ.3.20 కోట్లు‌గా అంచనా వేస్తున్నారు.

మోడీది.. దునియా చుట్టొచ్చిన దిమాగ్

Next Story

Most Viewed