- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీల్ అవుతున్న సూర్య ఫ్యాన్స్..
దిశ, వెబ్ డెస్క్: సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇందులో సూర్య నటన నిజంగానే ఆకాశాన్ని టచ్ చేసేలా ఉండగా.. ఒక కామన్ మ్యాన్, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎయిర్ లైన్స్ కంపెనీని స్థాపించడమే లక్ష్యంగా వచ్చిన చిత్రం అంతటా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సూపర్ రేటింగ్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్ జర్నీగా వచ్చిన ఈ సినిమా.. సూర్య సాలిడ్ పర్ఫార్మెన్స్‌కు మరో ఎగ్జాంపుల్‌గా నిలవడంతో పాటు తనకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ అపర్ణ బాలమురళి క్యారెక్టర్‌ను డైరెక్టర్ సుధ కొంగర మలిచిన తీరు అద్భుతం అంటున్నారు ఆడియన్స్. తను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి సూర్యకు గట్టిపోటీ ఇచ్చేలా నటించి స్క్రీన్ స్టోలర్‌గా కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. సూర్య తల్లి క్యారెక్టర్ చేసిన ఊర్వశి నుంచి.. ఫ్రెండ్స్, విలేజర్స్ ప్రతీ ఒక్కరి పాత్రకు ప్రిఫరెన్స్ ఇస్తూ సుధ కొంగర సినిమాను నడిపించిన విధానం అదుర్స్. కథలో బలం, కథనంలో పరుగు, కథానాయకుడిలో పౌరుషం, తపన, ఆరాటంతో పాటు ఎమోషన్స్ సీన్స్‌లో జీవించిన తీరు.. కథానాయికలో పొగరు, ప్రేమ.. జీవీ ప్రకాష్ అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ .. వెరసి ‘ఆకాశం నీ హద్దురా’ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా సూర్యకు డబ్బింగ్ అందించిన హీరో సత్య దేవ్‌కు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సూర్య ఫ్యాన్స్.
సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా సరే.. సూర్య అభిమానులు మాత్రం కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. పలు డిజాస్టర్స్ తర్వాత సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ అయితే బాగుండేదని అంటున్నారు. సినిమా హాల్లో రిలీజ్ అయితే కమర్షియల్ సక్సెస్ అందుకునేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నైస్ కంటెంట్‌తో ఎమోషనల్ రోల్ కోస్టర్‌గా వచ్చిన సినిమా డైరెక్టర్ సుధ కొంగర పదేళ్ల డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేస్తూ బెస్ట్ రిజల్ట్‌తో ఔట్‌స్టాండింగ్ రివ్యూస్ అందుకోవడం మాత్రం హ్యాపీగా ఉందంటున్నారు ఫ్యాన్స్. 2020లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఇది కూడా ఒకటి కావడం గర్వంగా ఉందంటున్నారు. థియేటర్స్ ఓపెన్ అయ్యాక కచ్చితంగా సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.