- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదిలాబాద్ కంటైన్‌మెంట్ జోన్లలో మళ్లీ సర్వే?
దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా పాజిటివ్ కేసులు వచ్చిన కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తాజాగా రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ వచ్చిన ఇద్దరిలో ఒక వ్యక్తిని మతపెద్దగా స్థానికులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి సమాచారం ఇవ్వకుండానే పట్టణంలో విస్తృతంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించాడు. జిల్లా కలెక్టర్‌తోపాటు అనేక మంది ప్రముఖులను కూడా ఆయన కలిసినట్టు ప్రచారం జరుగుతున్నది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో కంటైన్‌మెంట్ జోన్లను పెంచారు. భైంసా పట్టణంతోపాటు, జిల్లాలోని కొన్ని గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో రీ- సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో రీ-సర్వే చేయాలని ఆదేశించారు. సోమవారం నుంచి వైద్య సిబ్బంది మరోసారి సర్వే నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Tags: re-Survey, Adilabad, collector, office, police, medical Employees, muslim person, Delhi, corona