పుస్తకంతో విజ్ఞానం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

by Sridhar Babu |
book-fair1
X

దిశ, అంబర్ పేట్: పుస్తకంతో విజ్ఞానం పెంపొందించుకోవచ్చునని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత 10 రోజులుగా పుస్తకాల పండుగ జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. తను కోటీలో విశాలాంధ్ర, నవోదయలో పుస్తకాలు కొనేవాడినని, ఇలాంటి పుస్తక ప్రదర్శనలు కోట్లాది మంది పుస్తక ప్రియులకు ప్రయోజనకరమని అన్నారు. స్కూల్ లో గ్రంధాలయాలు తనకెంతో ఉపయోగపడేదని వివరించారు. పుస్తకం చదివి విజ్ఞానం ఎంతో సంపాదించుకోగలమన్నారు. కంప్యూటర్, సెల్ లు సరికాదన్నారు. పిల్లలకు పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ జీవిత చరిత్రలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. గ్రంధాలయాలు ఎంతో గొప్పవన్నారు. తనకు పక్ష పత్రిక నడిపిన అనుభవం ఉందన్నారు. శ్రీశ్రీ మహా ప్రస్థానం వచ్చిన తరువాతే పేరు వచ్చింది. పైరసీ పై గట్టి శిక్షలు వేయాలని నేను న్యాయ మూర్తులకు చెబుతానని తెలిపారు. చదవండి, చదివించండి, పుస్తకాన్ని ఆదరించండని పిలుపునిచ్చారు. ‘తెలుగెత్తి జై కొట్టు’ పుస్తకాన్ని జస్టీస్ ఎన్ వి రమణకు తంగిరాల చక్రవర్తి, కె. ఆనందాచారి, మోహన కృష్ణలు అందించారు. సభకు కోయ చంద్రమోహన్ స్వాగతం పలుకగా, కోశాధికారి రాజేశ్వరావు, శృతికాంత్ భారతి, నారాయణ రెడ్డి, రాజేశ్వర్, శోభన్ బాబు, బుక్ ఫెయిర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed