ప్రశాంత్ భూషణ్‌కు గడువు ఇచ్చిన కోర్టు!

by Shamantha N |
ప్రశాంత్ భూషణ్‌కు గడువు ఇచ్చిన కోర్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన ప్రకటనపై అభిప్రాయాన్ని మార్చుకునేందుకు సుప్రీంకోర్టు రెండు-మూడు రోజుల గడువును ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ..తప్పులు చేయకుండా ఎవరూ ఉండలేరు. మీరు వంద మంచి పనులు చేసినప్పటికీ, పది తప్పులు చేసేందుకు అనుమతించమన్నారు.

అయితే, తాను సమర్పించిన వాదనలో ఎటువంటి మార్పులుండవని, దీనివల్ల కోర్టు సమయం వృధా అవుతుందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. దీనికి స్పందించిన మిశ్రా, దీనిపై తిరిగి ఆలోచించుకోవాలని, మీరు కేవలం చట్టపరమైన అవకాశాలను ఉపయోగించవద్దన్నారు. కాగా.. ఆగష్టు 14న కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం దోషిగా తేల్చింది.

ఈ కేసును వాయిదా వెయ్యాలని ప్రశాంత్ భూషణ్ కోర్టును అభ్యర్థించారు. శిక్ష వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన శిక్షను మరో బెంచ్ విచారించాలనే ప్రశాంత్ భూషణ్ అభ్యర్థన సరైంది కాదని కోర్టు తెలిపింది. ప్రశాంత్ భూషణ్ తరపున దుష్యంత్ దవే తమ వాదనను వినిపించారు. పునర్విచారణ పిటిషన్ వేసేంతవరకు శిక్ష పడదని కోర్టు హామీ ఇస్తుందని జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. 30 రోజుల్లో సమీక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కుందని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. నేరాన్ని రుజువు చేయడం, శిక్ష విధించడం వేరువేరు విషయాలు, తమ అభ్యర్థన న్యాయ సమ్మతమైనది. శిక్ష వాయిదా వేయవచ్చని దుష్యంత్ కోర్టు ముందు వాదనను వినిపించారు.

Advertisement

Next Story

Most Viewed