'సెంట్రల్ విస్టా'కు సుప్రీం అనుమతి

by Anukaran |
సెంట్రల్ విస్టాకు సుప్రీం అనుమతి
X

దిశ, వెబ‌్‌డెస్క్: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సెంట్రల్ విస్టా పనులపై నమోదైన కేసులో మంగళవారం త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. కొత్త పార్లమెంట్, ప్రధాని, ఉపరాష్ట్రపతి సచివాలయ భవన సముదాయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో ఎలాంటి లోపాలు లేవని బెంచ్ పేర్కొంది.

తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఇద్దరు జడ్జీలు అనుకూలంగా వ్యవహరించగా.. మరో జడ్జి విభేదించారు. పిటిషనర్ అభ్యంతరాలను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది.

Advertisement

Next Story