ముంబై పోలీసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

by Shamantha N |   ( Updated:2020-08-19 08:31:00.0  )
ముంబై పోలీసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకు అప్పగించే ముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముంబై పోలీసుల ప్రవర్తన తీరు వల్లే ఆ కేసును సీబీఐకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

ఈ కేసు విచారణ నిమిత్తం వచ్చిన బీహార్ పోలీసులకు.. ముంబై పోలీసులు అడ్డంగులు కల్పించడం పలు అనుమానాలకు దారితీసిందన్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పగించేలా ప్రేరేపించిందని సుప్రీం స్పష్టంచేసింది.

ఇదిలాఉండగా, విచారణ కోసం వెళ్లిన బీహార్ పోలీసులను క్వారంటైన్‌లో ఉండాలనడంతో పాటు, కొన్ని ముఖ్యపత్రాలకు చెందిన సమాచారం ఇవ్వకుండా వారిని ముంబై పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కాగా, వారి ప్రవర్తన తీరుపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం అసహనం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story