ఢిల్లీకి గంజాయి.. సరఫరా చేస్తున్నది విద్యార్థులే

by Anukaran |
ఢిల్లీకి గంజాయి.. సరఫరా చేస్తున్నది విద్యార్థులే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలను దాటుతూ నార్త్ ఇండియాలో గంజాయి రాకెట్ సాగుతున్నది. సుమారు మూడేళ్లుగా ఈ దందా సాగుతున్న ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర ప్రదే శ్ లోని గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి వ్యాపారులతో ఢిల్లీకి చెందిన గంజాయి స్మగ్లర్లు చేతులు కలిపి ఈ రాకెట్ సాగిస్తున్నట్లు సమాచారం. ఐదు రోజుల క్రితం సుమారు రూ.40 లక్షల విలువైన గంజాయి నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపింది. దీని వెనుక నార్త్ ఇండి యాకు చెందిన పెద్ద మనుషులు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రా టు ఢిల్లీ..!

కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి ఢిల్లీకి సరఫరా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన సునీల్ కుమార్ జాహిద్ షఫీతో పాటు మరో నలుగురు ముఠా గా ఏర్పడ్డారు. వీరికి ఢిల్లీతో పాటు ప‌లు రా ష్ట్రాల‌కు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి ఢిల్లీకి చేరిన త‌ర్వాత అక్కడినుంచి ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్ము తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలు స్తోంది. ఆంధ్ర ప్రదేశ్​లో గంజాయి రూ.3 వేల‌కు కొని ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల్లో రూ.15 నుంచి రూ.25 వేల వ‌ర‌కు అమ్ముతున్న‌ట్టు స‌మాచారం.

యథేచ్ఛ‌గా సరిహద్దులు దాటిస్తూ..

ఉత్తర భారతానికి చెందిన గంజాయి స్మగ్లర్లు ఆంధ్రాలో కొంద‌రిని నియ‌మించుకుని గంజా యిని సరిహద్దులు దాటిస్తున్నారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలోని ఆయా రాష్ట్రాల సరిహద్దు లోకి ప్రవేశించడానికి ముందే వాహనానికి స్థానిక నెంబ‌ర్ ప్లేట్ అమ‌ర్చి స‌ర‌ఫ‌రా చేస్తున్నా రు. ఇలా ఐదారు రాష్ట్రాలు దాటించి ఢిల్లీకి చే ర‌వేసి అక్క‌డ గంజాయి ఆకును పౌడ‌ర్ రూ పంలోకి మార్చి ప్యాకెట్లు చేసి అమ్మ‌కాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా, స్మ‌గ్ల‌ర్లు పోలీసుల క‌ళ్లు గ‌ప్పి దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్మగ్లర్ల వేషధారణ హుందా గానే ఉం టుంది. పైగా వాహ‌న నెంబ‌ర్ ప్లేట్లు మార్చ‌డంతో వారి ప‌ని మ‌రింత తేలిక‌వుతున్న‌ది. దీంతో గంజాయి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 150 కేజీల గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. దీని విలువ సుమారు రూ.40 లక్షల పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ వ్యవహారంపై నిర్మల్ జిల్లా పోలీసులు ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు ఢిల్లీ పోలీసులకు సమాచారం చేరవేశారు.

పోలీసులకు సమాచారం ఇచ్చాం: నిర్మల్ అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి

నిర్మల్ జిల్లా సరిహద్దులో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్న విషయం వాస్తవమే. ఉత్తర భారతంలో దీని విలువ సుమారు రూ.40 లక్షలకు పైగా ఉంటుంది. త‌మ సిబ్బందిని ఏమార్చి స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. నిఘా పెట్టి ఈ రాకెట్ ని ఛేదించాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు స్మగ్లర్లు అంగీకరించారు. గంజాయి రవాణా చేస్తున్న కారు సైతం ఢిల్లీలో ఒక వ్యక్తి నుంచి దొంగిలించినట్లు గుర్తించాం. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ఢిల్లీ పోలీసులకు చేర వేశాము. సునీల్ కుమార్, జాహిద్ షఫీ అనే ఇద్దరిని అరెస్టు చేశాం. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటాం. గంజాయి రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ లు పెడతాం. ఆదిలాబాద్​ జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ రవాణా చేసే సమాచారం ఉంటే పోలీసులకు తెలియ‌జేయాలి.

Advertisement

Next Story

Most Viewed