- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరాచకం: కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డు కొరికి..
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతున్నా మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు కొంతమంది. దెయ్యాలు వదిలిస్తామని, పిల్లలు పుట్టేలా చేస్తామని ఏవేవో పూజలు చేయించి డబ్బులు గుంజుతున్న భూత వైద్యుల మాయ మాటలు నమ్మి బలవుతున్నారు. మరో పక్క నాటు వైద్యం పేరుతో వారు చేసే వైద్యానికి ఎంతోమంది బలవుతున్నారు. తాజాగా ఈ మూఢనమ్మకానికి రెండు నెలల చిన్నారి బలి అయ్యింది. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడు కి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల బాబు ఉన్నాడు. రెండు, మూడు రోజులుగా బాబు గుక్కతిప్పకుండా ఏడుస్తున్నాడు. గుక్కతిప్పుకోకుండా బాబు ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడు వారికి మాయమాటలు చెప్పాడు. బాబు కడుపునొప్పితోనే ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. అయినా బాబు ఏడుపు తీవ్రమవ్వడంతో తల్లిదండ్రులు కరకగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే బిడ్డ మృతిచెందింది. భూత వైద్యుడి పంటి గాయానికి బాబు చిన్నపేగు తెగిపోయిందని, అందువల్లే బిడ్డ మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై ఎటువంటి పోలీస్ కేసు నమోదు కాకపోవడం గమనార్హం.