- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Evaru Meelo Koteeswarulu :ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సూపర్ స్టార్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమదైన శైలిలో రాణిస్తూ.. తెలుగులో టాప్ స్టార్స్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వెండితెరపై మెరుపులు మెరిపించి కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినీ తారలు ఇప్పుడు బుల్లితెరపై కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. వీలు కుదిరితే చాలు ప్రతీ ఇంటా స్మాల్ స్ర్కీన్‌పై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి అతి తొందర్లోనే స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్‌లో ఇద్దరు ఒకే వేదికపై సందడి చేసి, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా సందడి చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే.. ఇటీవలే ఈ స్పెషల్ ‘షో’కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని, అతి త్వరలోనే ప్రసారం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. బయటకు లీకైన సమాచారం ప్రకారం.. ఈ ‘షో’లో సూపర్ స్టార్ భారీగా డబ్బు గెలుచుకున్నారని, ఇద్దరి మధ్య పోటీ కూడా ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను దసరా కానుకగా ప్రసారం చేయనున్నారని మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.