శృతి మించిన గురువులు.. ఒక్క విద్యార్థినిపై ఇద్దరి కన్ను!

by Sumithra |   ( Updated:2021-02-12 08:40:56.0  )
lecturers sexaul harasments in college student
X

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులపైనే ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తే.. గురువు మాత్రం విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి.. జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తాడు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులు పిల్లల అవసరాలను తీరుస్తే.. గురువు మాత్రం విద్యార్థులు జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో కనుక్కుని అందుకోసం వారు నిత్యం శ్రమించేలా అన్ని విధాలా సాయం చేస్తారు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అంతటి ప్రాధాన్యం ఉంది.

lecturers sexaaul harasments in college student

‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరహ: గురుసాక్ష్యాత్ పరబ్రహ్మ తస్మ‌య్ శ్రీ గురవే నమ:’ దీని అర్థం ఎంటంటే.. ఒకానొక సందర్భంలో గురువును ‘బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడి’తో సమానంగా పోల్చారు. పిల్లలు చెడు మార్గంలో పయణించకుండా మంచి నడవడిక నేర్పించడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పేంచే వారే గురువు. ఈ పద్యాన్ని బాల్యంలో అందరూ కంఠస్తం చేసే ఉంటారు. అలాగే ‘గురువు లేని విద్య గుడ్డి విద్య’.. ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకున్న పాఠాలు అప్పటిమందమే.. భవిష్యత్తులో ఆ విద్యార్థి ఎదుగుదలకు ఏమాత్రం దోహదం చేయలేవని దానర్థం. చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే గురువుకు ఉన్న స్థానం ఎంటో తెలుస్తోంది. ‘ద్రోణాచార్యుడి పేరు వింటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఏకలవ్యుడు’. గురుశిష్యుల బంధం అంటే వీరిద్దరిదే. ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకుని ‘విలు విద్య’ను అభ్యసించడం ఓ సాహసం అయితే.. గురువు అడిగాడని తన బొటన వేలునే త్యాగం చేసిన ఘనత ఏకలవ్యుడికే దక్కింది. కానీ, నేటి సమాజంలో ఉపాధ్యాయుల విలువ శృతి మించుతోంది. దీనికి ఈ స్టోరీ చక్కటి ఉదాహరణగా పనికొస్తుంది.

అయితే, ప్రస్తుత రోజుల్లో కొందరు ఆ బాధ్యతను విస్మరించడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యతతో వ్యవహరించాల్సిన వారు శృతి మించుతున్నారు. విద్యను బోధించే క్రమంలో తమ కామవాంఛను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులు తరుచూ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరికొన్ని రావడం లేదు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున గల రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్, మరో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించారు. కాలేజీలో నిర్వహించిన ఓ పార్టీ వేడుకల్లో భాగంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు వివరించగా వారు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణ్ వర్మ, లెక్చరర్ రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 354ఏ,354బీ,342,506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed