'శాంతాబాయి' గా సన్నీ ఐటెం సాంగ్.. ఆగలేమంటున్న ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-06-08 01:09:28.0  )
శాంతాబాయి గా సన్నీ ఐటెం సాంగ్.. ఆగలేమంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఐటెం సాంగ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన బేబి డాళ్ మొదలు ఈ మధ్య వచ్చిన పింక్ లిప్స్ వరకూ సన్నీ అందాలను, స్టెప్పులను మర్చిపోని వారుండరు. ఇక అమ్మడు తెలుగు లో చేసినవి రెండు ఐటెం సాంగ్స్ యే అయినా అవి ఎంతటి ఊపు ఊపినవో తెల్సిందే. అడపాదడపా హీరోయిన్ గా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ కి సాయి అంటోంది సన్నీ. ఇక తాజాగా సన్నీ మరో ఐటెం సాంగ్ కి పచ్చ జెండా ఊపింది. తెలుగు, హిందీ, తమిళ్ లో రచ్చచేసిన ఈ హాట్ బ్యూటీ మరాఠీ లో రచ్చ చేయడానికి సిద్ధమైంది.

మరాఠీ లో తెరకెక్కుతున్న 'ఆమ్దార్ నివాస్'లో 'శాంతాబాయి'గా ప్రత్యేక గీతంలో కవ్వించనుంది. రోహిత్ చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే రాజకీయ నాయకుడిగా కనిపించాడు. ఇకపోతే ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు అంతర్జాలంలో సునామీలా పోటెత్తాయి. ఈ ఫొటోలో శాంతాబాయి గా సన్నీ లియోన్ మహారాష్ట్ర కోలి స్టైల్ వేషధారణలో పసుపు జాకెట్టు -ధోతితో అదరగొట్టేసింది. ఇక సన్నీ సాంగ్ కోసం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed