జయకర్‌ను పరామర్శించి.. ఆర్థిక సాయం చేసిన సునీల్ రెడ్డి

by Sridhar Babu |
Jayaker1
X

దిశ, పలిమేల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు ఏర్కారి జయకర్ తండ్రి ఇటీవల మరణించగా, వారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ మంథని నియోజకవర్గ నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి రూ. 3 వేల ఆర్ధిక సాయం చేశారు. మండల యువ మోర్చా లంగారి ఉపేందర్, ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ బుచ్చయ్యలు కలిసి 25 కిలోల రైస్ బ్యాగ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోయల్ కార్ నిరంజన్, ఉపాధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శ్రీనివాస్, కిషాన్ మోర్చా మండల అధ్యక్షులు దుర్గారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story