- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్‌ఫార్మా త్రైమాసిక లాభం 37 శాతం క్షీణత!
దిశ, సెంట్రల్ డెస్క్: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బుధవారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత నికర లాభం 41.25 శాతం వృద్ధితో రూ. 3,764.93 కోట్లని ప్రకటించింది. గతేడాది రూ. 2,665.42 కోట్లు నమోదైనట్టు ఔషధ తయారీ సంస్థ తెలిపింది. త్రైమాసికంలో ఆదాయం 13 శాతం పెరిగి రూ. 32,325 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో సన్ ఫార్మా ఏకీకృత లాభంలో 37 శాతం క్షీణించి రూ. 399.8 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం 14.3 శాతం పెరిగి రూ. 8,184.9 కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి, మొత్తం ఆదాయంలో 30 శాతం వాటా కలిగిన భారత అమ్మకాలు రూ. 9,710 కోట్లుగా ఉన్నాయి. “గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు సంస్థ వెల్లడించింది.