- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌తో ఈటల కుమ్మక్కు.. సుమన్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ రేవంత్ తో కుమ్మక్కు అయ్యారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈటల తప్పులు చేసి టీఆర్ఎస్ పార్టీని వీడారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు భారతీయ జనతా కాంగ్రెస్ లా మారి టీఆర్ఎస్ ను హుజురాబాద్ లో ఓడించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, క్రాంతి కిరణ్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ లు జాతీయ స్థాయిలో శత్రువులు .. హుజురాబాద్ లో మిత్రులుగా మారడం సిగ్గు చేటన్నారు. నైతిక విజయం టీఆర్ఎస్ దే అన్నారు.
బీజేపీ నేతలు శుష్క ప్రియులు శూన్యహస్తాలు ఆపాలని సూచించారు. బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ అంటే ఏమో అనుకున్నామని.. రాజాసింగ్, రఘునందన్ రావుతో పాటు మరో ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ కు అత్యల్ప ఓట్లు రావడం ఇదే ప్రథమం అన్నారు. కమలం కింద పడకుండా ‘చెయ్యి’ అడ్డం పడిందన్నారు. ఈటల గెలిచాక కూడా రొటీన్ డైలాగులు మాట్లాడటం కాదు అని, మోడీ కాలు మొక్కి హుజురాబాద్ కు ఏం ప్యాకేజీ తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
- Tags
- Balka Suman
- etala