- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవమానం భారంతో ఆత్మహత్య…
దిశ, చేవెళ్ల : చేపలు పట్టిన యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మొయినా బాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం గా మొయినా బాద్ మండలం లోని ఎత్ బార్ పల్లి గ్రామానికి చెందిన మల్లని శ్రీకాంత్ (23) ఈనెల 15వ తేదీన నక్కలపల్లి గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. చెరువులో చేపలు పడుతుండగా నక్కల పల్లి గ్రామానికి చెందిన బంటు మల్లేష్, వడ్డే శివలు చెరువులో చేపలు పడుతున్న శ్రీకాంత్ ను చూసి మా గ్రామంలోని చెరువులో చేపలు ఎందుకు పెడుతున్నావ్ అంటూ అతనితో ఘర్షణపడ్డారు.
ఇద్దరు కలిసి అతడిని బూతు మాటలు తిడుతూ అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భాస్కర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శ్రీకాంత్ మృతి చెందడంతో ఎత్ బార్ పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ బంధువులు స్నేహితులు నక్కల పల్లి గ్రామానికి వెళ్లి మల్లేష్ ,శివలు శ్రీకాంత్ మృతికి కారణమంటూ ధర్నా చేశారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసిపి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొయినా బాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు సిబ్బందితో కలిసి ఉండే నక్కల పల్లి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరువర్గాలకు నచ్చచెప్పి మృతి చెందిన శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.