ఐఐటీ క్రాక్ చేయకపోతే మగాళ్లు కాదా..?

by Shyam |   ( Updated:2021-09-26 02:16:23.0  )
ఐఐటీ క్రాక్ చేయకపోతే మగాళ్లు కాదా..?
X

దిశ, సినిమా: ‘లైఫ్‌లో ఏ స్థాయికి వెళ్తావ్? నీ ఇల్లు ఎంత గ్రాండ్‌గా ఉంటుంది? ఎంత అందమైన అమ్మాయితో పెళ్లి అవుతుంది? నీ పిల్లలు యూరోప్ విజిట్ చేస్తారా లేదా? నువ్వు ఎంత లగ్జరీ కారులో తిరుగుతావ్? అనేది ఒక్క ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది. ఇండియాలోనే మోస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఐఐటీ క్రాక్ చేశావో.. నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. లేదంటే లైఫ్‌లో ప్రతీ విషయంలో అడ్జస్ట్ కావాల్సిందే. అసలు నువ్వు ఐఐటీ క్రాక్ చేయకపోతే నువ్వు మగాడివే కాదు’ ఇలాంటి లెక్చర్స్ ఇస్తూ స్టూడెంట్స్‌ను ఓరియంటేషన్ క్లాస్‌లోనే భయపెట్టేస్తుంటారు. రాత్రీపగలు తేడా లేకుండా చదువు చదువు అంటూ వెంటపడుతూ బాల్యాన్ని చిదిమేస్తారు. ఐఐటీయన్ కాకపోతే జీవితమే వ్యర్థమన్న లెవల్‌లో కలలోనూ కలవరించేలా చేసేస్తారు. ఈ ఎగ్జామ్‌లో విన్ అయితే రివార్డులు లేదంటే ఆత్మహత్యలు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్ 2 రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌ టచ్ చేసింది. ‘వార్‌లో లూజ్ అయితే లూజర్స్ అనరు వారియర్స్ అని మాత్రమే పిలుస్తారు, కలలు ఊహించబడతాయి.. లక్ష్యాలు సాధించబడతాయి’ అనే మెసేజ్ ఇచ్చిన ‘కోటా ఫ్యాక్టరీ’ ట్విట్టర్ట్ ట్రెండింగ్‌లో నిలిచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా..
ఐఐటీ క్రాక్ చేయాలంటే.. రాజస్థాన్, కోటాలోని బిగ్గెస్ట్ ఇనిస్టిట్యూట్ మహేశ్వరి క్లాసెస్‌లో జాయిన్ కావడం ఫస్ట్ స్టెప్. అయితే చేరిన తర్వాతే అసలు టాస్క్ ఎదురవుతుంది. ఎందుకంటే చెప్పిన టైమ్‌కు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా తినమంటే తినాలి, చదవమంటే చదవాలి, పడుకోమంటే పడుకోవాలి. కానీ, రూ. కోట్లు కుమ్మరించి చదువుకుంటున్న ఇనిస్టిట్యూట్స్‌లో లెక్చరర్స్ సరిగ్గా లేకపోతే.. అదే టైమ్‌లో ఒక టెక్నిక్ ఫాలో అవుతూ కొత్తగా ఓపెన్ అయిన ఇనిస్టిట్యూట్‌లో లెక్చర్స్ బాగున్నారని పిల్లలకు తెలిస్తే.. సహజంగా పిల్లలంతా అటువైపే ఆకర్షించబడతారు. ‘ఏమర్స్’ పేరుతో న్యూ ఇనిస్టిట్యూట్ ఓపెన్ చేసిన లెక్చరరే జీతూ భయ్యా. ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను అపాయింట్ చేసుకుని తనకు పార్ట్‌నర్ షిప్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత మహేశ్వరి క్లాసెస్‌లో వర్క్ చేస్తున్న మ్యాథ్స్ లెక్చరర్‌ను రెండేళ్ల అగ్రిమెంట్ ద్వారా తన ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ చేసుకుంటాడు. దీంతో కోపమొచ్చిన మహేశ్వరి క్లాసెస్ వ్యవస్థాపకులు.. కొత్తగా ప్రారంభమైన ఇనిస్టిట్యూట్‌ సక్సెస్‌‌ను అడ్డుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశాడు? జీతూ భయ్యాకు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? కెమిస్ట్రీ లెక్చరర్‌తో జీతూకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అనేది కథ.

రైజింగ్ పాయింట్స్:
1. లైఫ్‌లో అమ్మ, స్నేహితుడు, గురువు ఎంత ముఖ్యమో ఎలివేట్ చేశారు మేకర్స్.
2. ‘బి యువర్ సెల్ఫ్’ అనేది కరెక్ట్ కాదు ‘బెటర్ యువర్‌సెల్ఫ్’ అనేది ఇంపార్టెంట్
3. ఐఐటీ క్రాక్ చేస్తే రివార్డ్స్ కామన్, కానీ సాధించకపోతే ఆత్మహత్యే ఆప్షన్ కాదు
4. టీనేజ్‌లో అపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది నార్మల్. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం మంచిది కాదు
5. సిలబస్ వెలుపల నేర్చుకున్న పాఠాలు జీవితమనే పరీక్షలో ఉపయోగపడతాయి
6. మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తే ప్రాబ్లమ్స్‌ను పర్‌ఫెక్ట్‌గా సాల్వ్ చేయగలం
7. కష్టపడి పనిచేసే వారికి జీవితం సులభతరం అవుతుంది
8. చదువుకునేందుకు నిర్దిష్ట సమయం, స్థలం అవసరం లేదు

– సుజిత రాచపల్లి

Advertisement

Next Story

Most Viewed