‘రైటర్ పద్మభూషణ్’గా సుహాస్ తొలి అడుగు

by Shyam |
‘రైటర్ పద్మభూషణ్’గా సుహాస్ తొలి అడుగు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫొటో’తో హీరోగా మారిన కమెడియన్ సుహాస్.. సూపర్ డూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుహాస్ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాడు. షణ్ముఖ ప్రశాంత్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేయనున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’ టైటిల్‌తో వస్తున్న చిత్రం నుంచి సుహాస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, రచయితగా ‘తొలి అడుగు’ పుస్తకాన్ని రాసిన పద్మభూషణ్ .. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలడు అని తెలిపింది మూవీ యూనిట్. లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నామని ప్రకటించారు. నెక్స్ట్ అప్‌డేట్‌లో కాస్ట్ అండ్ క్రూ గురించి వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story