నన్ను చంపాలని చూస్తున్నారు..

by Sumithra |
నన్ను చంపాలని చూస్తున్నారు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సుదర్శన్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్, పీఏ చైతన్య తనను వేధిస్తున్నారని, హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.

ఈ నేపథ్యంలోనే సెల్‌టవర్ ఎక్కిన సుదర్శన్ తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story