నిజామాబాద్ ఇంచార్జ్ డీఎంహెచ్ఓగా సుదర్శనం..!

by Shyam |
నిజామాబాద్ ఇంచార్జ్ డీఎంహెచ్ఓగా సుదర్శనం..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:

నిజామాబాద్ ఇంచార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ సుదర్శనంకు పోస్టింగ్ ఇస్తూ.. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ అయిన సుదర్శనం.. ఇంచార్జ్ డీఎంహెచ్ఓగా పనిచేస్తూ ఆగస్టు 3 నుంచి 29 వరకు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. అనంతరం ఆగస్టు 31న విధుల్లో చేరిన సుదర్శనంకు పోస్టింగ్ ఇవ్వడంలో వైద్యారోగ్య శాఖ ఆలస్యం చేసింది.

ఇదే విషయంపై దిశ దినపత్రికలో ఈ నెల 5న ‘కిస్సా కుర్సికా ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ కథనంపై వైద్యారోగ్య శాఖలో, జిల్లా అధికార యంత్రాంగంలో చర్చకు దారి తీసింది. ఇంచార్జీ డీఎంహెచ్ఓగా ఉన్న డాక్టర్ రమేష్ తనకు పోస్టింగ్‎పై ఆసక్తి లేదని.. రాష్ర్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల ఉత్తర్వులు కోసం ఎదురు చూస్తున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఎట్టకేలకు సుదర్శనంకు తిరిగి ఇంచార్జ్ డీఎంహెచ్ఓగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed