గుత్తి వంకాయ కూర

by Hamsa |   ( Updated:2020-03-06 04:07:47.0  )
గుత్తి వంకాయ కూర
X

కావాల్సిన పదార్ధాలు :

వంకాయలు-10
ఉల్లిపాయలు-2
పచ్చి మిర్చి-5
కరివేపాకు-10 ఆకులు
అల్లం వెల్లుల్లి పేస్ట్- తగినంత
ఉప్పు-రుచికి సరిపడా
కారం-రుచికి సరిపడా
కొత్తిమీర-ఒక కట్ట
మెంతి ఆకు-ఒక కట్ట
చింత పండు-పులుసు కి సరిపడా-నానబెట్టి పక్కన పెట్టుకోవాలి
నూనె-సరిపడా
మసాలా పేస్ట్ కు కావాల్సిన పదార్ధాలు:
చక్క-2
లవంగాలు-3
యాలకులు-3
పల్లీలు- ౩ టేబుల్ స్పూన్
నువ్వులు-2 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి- కొద్దిగా
ధనియాలు-2 టేబుల్ స్పూన్
జీల కర్ర-2 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి-5
వెల్లుల్లి
పైన చెప్పినవన్నీ దోరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.

తయారు చేసే విధానం:

*ముందుగా వంకాయలను కడిగి శుభ్రం చేసి x – మార్క్ వచ్చేలా కట్ చేసి, ఉప్పు కలిపినా నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి.
*తరువాత మసాలా పేస్ట్ లో ఉప్పు, కారం వేసి కట్ చేసిన వంకాయలతో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
*స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడయ్యాక ఉల్లిపాయలు,కరివేపాకు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
*అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పచ్చి వాసన పోయేవరకు వేయించి చిటికెడు పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

-తరువాత స్టఫ్ చేసిన వంకాయలను వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
-వంకాయలు మగ్గిన తరువాత నానబెట్టిన చింతపండు పులుసు వేసి ఒక 15 నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి.
-పులుసు దగ్గర పడ్డాక కొత్తిమీర, మెంతి ఆకు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేసేయాలి.
-చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి అలంకరిస్తే నోరూరించే గుత్తి వంకాయ కూర రెడీ.

Tags : stuffed brinjal curry recipe,Gutti Vankaya Curry,Stuffed Brinjal Curry

Advertisement

Next Story