అమెరికా నుంచి గురువు ఖాతాలోకి రూ. 50 వేలు

by srinivas |

దిశ, ఏపీ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లంటే కేవలం పాఠాలు చెబితే సరిపోదు, పాఠాలు చెప్పేందుకు అవసరమైన విద్యార్థులను కూడా వారే వెతుక్కుని జాయిన్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని పేరెన్నికగన్న స్కూళ్లు, కళాశాలల్లో జరిగే సాధారణ తంతు ఇది. అలా పాఠశాల యాజమాన్యం చెప్పినన్ని అడ్మిషన్లు చేయలేదన్న కారణంగా నెల్లూరు వేదాయపాళెంలోని నారాయణ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటసుబ్బయ్యను విధుల్లోంచి తప్పించారు. దీంతో ఆయన కరోనా కష్టకాలంలో కుటుంబాన్ని పోషించుకునేందుకు అరటి పళ్లు అమ్ముకుంటున్నారు. దీనిని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువుకి 86,300 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం మరో 20,000 రూపాయలు అందజేసింది. అమెరికా నుంచి శ్యామ్‌ అనే వ్యక్తి 50,000 వెంకటసుబ్బయ్య ఖాతాలో జమ చేశారు.

Advertisement

Next Story

Most Viewed