విద్యార్థులు భావి భారత నిర్మాతలవ్వాలి: కర్ణకంటి మంజులరెడ్డి

by Shyam |
social worker
X

దిశ,హుస్నాబాద్: నేటి విద్యార్థులు భావి భారత నిర్మాతలు కావాలని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ఎల్ఈడీ టీవీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటుకు నగదు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు చదువులు కష్టపడుతూ చదవకుండా ఇష్టంతో చదువుతే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న అనేకమంది డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ, సామాజిక, శాస్త్రవేత్తలు వంటి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని దీంతో నేటి విద్యార్థులు రాబోయే తరానికి దిక్సూచి కావాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహ్మదాపూర్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు, మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed