- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడివాడలో కలకలం.. విద్యార్థులకు అస్వస్థత
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలోని ఆర్సీఎమ్ మిషనరీ స్కూల్ లో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం ఒక్కసారిగా కలకలం రేపింది. 11 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కళ్లుతిరిగి పడిపోవడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు విద్యార్థులు కోలుకోగా ఏడుగురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. తక్షణమే వైద్య సదుపాయం కల్పించాలని కృష్ణా జిల్లా డీఎంఅండ్ హెచ్ వో డా.సుహాసినికి ఫోన్ లో ఆదేశించారు. అశ్వస్థతకు గురైన విద్యార్థులను గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించాలని మంత్రి ఆళ్ల నాని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల అశ్వస్థతకు గల కారణాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయం కల్పించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని వైద్య అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. ఎలాంటి ఆందోళన లేదని మంత్రి ఆళ్ల నానికి జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి సుహాసిని వివరించారు. వేసవి కాలం రావడంతో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ళనాని సూచించారు.