టీచర్‌పై స్టూడెంట్ పేరెంట్స్ దాడి.. పెర్కిట్ పాఠశాలలో ఉద్రిక్తత

by Shyam |   ( Updated:2021-11-22 05:09:17.0  )
Student parents attack teacher
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిపై సోమవారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేశారు. క్లాస్ రూమ్‌లో అల్లరి చేస్తున్న ఇద్దరు విద్యార్థులను మందలించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తమ పిల్లలను మందలించారంటూ ఆగ్రహంతో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దాడి చేశారని తోటి ఉపాధ్యాయుల ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతిన్నాయని, క్షమాపణ చెప్పే వరకు విధులకు హాజరయ్యేదిలేదని పాఠశాల గ్రౌండ్‌లో భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాడి విషయమై ఎంఈవో రాజగంగారామ్‌ను వివరణ కోరితే.. తానకు సమాచారం లేదని, తాను సెలవులో ఉన్నానని తెలిపారు. స్కూల్లో కొందరు పేరెంట్స్ న్యూసెన్స్ చేసింది వాస్తవమేనని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు సీతయ్య స్పష్టం చేశారు.

epaper – 4:00 PM TS EDITION (22-11-21) చదవండి

Advertisement

Next Story

Most Viewed