పదో తరగతి విద్యార్థిని తుపాకీతో కాల్చిన తోటి విద్యార్థి

by Sumithra |
పదో తరగతి విద్యార్థిని తుపాకీతో కాల్చిన తోటి విద్యార్థి
X

లక్నో : క్లాస్ రూంలో కూర్చునే సీటు కోసం జరిగిన చిన్నపాటి గొడవ ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి గదిలో సీటు కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అందులో ఒకరు తర్వాతి రోజే ఇంటి నుంచి తుపాకీ తీసుకువచ్చి మరొకరిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని ఘటనస్థలంలోనే కస్టడీలోకి తీసుకున్నామని, మరో విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి సంతోశ్ కుమార్ సింగ్ తెలిపారు.

బుధవారం ఇద్దరు విద్యార్థులు సీటు కోసం గొడవపడ్డారని, తర్వాతి రోజు అందులో ఒకరు ఆర్మీలో పనిచేస్తున్న బంధువు నుంచి లైసెన్స్‌డ్ గన్ దొంగిలించి క్లాసు రూంకు తీసుకువచ్చాడు. రెండో పీరియడ్ ముగిసిన తర్వాత తన ప్రత్యర్థిపై తల, ఛాతి, కడుపులో కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి అక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుడు తుపాకీతో ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూం నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పరుగెత్తాడు. వెంటబడేవారిని బెదిరించడానికి గాలిలో కాల్పులు జరిపాడు. కానీ, బోధన సిబ్బంది ఎలాగోలా విద్యార్థిని పట్టుకుని పోలీసులు సమాచారమిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed