కొడుకులు స్కూల్ వెళ్లిన మొదటి రోజే.. తల్లడిల్లిన తల్లి గుండె

by  |   ( Updated:2021-12-27 10:57:20.0  )
కొడుకులు స్కూల్ వెళ్లిన మొదటి రోజే.. తల్లడిల్లిన తల్లి గుండె
X

దిశ, రాజోలి: బడికిపోయిన కొడుకు స్కూల్ బాగ్‌తో బస్సులో నుండి దిగుతుంటే కొడుకు ని చూసి సంబర పడాల్సిన తల్లి గుండె బాదుకుంది. కళ్లెదురుగా ఆడుతూ.. పాడుతూ.. ఉంటే కింద పడతారేమో అని భయపడి చేయి పట్టుకునే ఆ తల్లి.. కళ్లెదురుగా కంటికి దూరం అయిపోతుంటే కంట నీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేక పోయింది. ఈ హృదయ విదారక ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం లో శ్రీ నగర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మానవపాడు మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామానికి చెందిన కటిక మహే‌కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అభి (6), చిన్న కుమారుడు అజయ్ (4) వీరిద్దరిని ఒకే సారి స్కూల్ కి పంపించాలని భావించి వడ్డేపల్లి మండలం లోని రాఘవేంద్ర హై స్కూల్ బస్సులో(AP 16 TX 8389 ) పంపించారు.

మొదటి రోజు స్కూల్ ముగించుకొని తిరిగి అదే బస్సులో ఇద్దరు అన్నదమ్ములు శ్రీనగర్ కు చేరుకున్నారు. తన ఇద్దరు కుమారులు బస్సులో నుంచి దిగారని తల్లి సంతోషంగా ఎదురు చూసింది. అదే చివరి క్షణంగా కళ్ళ ముందు తన చిన్న కుమారుడు అజయ్ పై బస్సు వెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు దిగగానే అదే బస్సు ముందు టైర్ తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూల్ కి వెళ్ళిన మొదటి రోజే చివరి రోజు కావడం, స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తన పిల్లలు స్కూల్ కి వెళ్లారనే సంతోషం గడవకముందే అదే రోజు చివరి రోజు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed