- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బజారులో బత్తాయి
దిశ, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసే సి విటమిన్ బత్తాయిలో ఉందని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. ఇది విన్న బత్తాయి రైతులు సంబుర పడిపోయారు. పంటకు డిమాండ్ పెరుగుతదని.. ధర కూడా బాగా వస్తదని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాశలయ్యాయి. పంటకు డిమాండ్ రాకపోగా.. ధర అమాంతం పడిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు విలవిలలాడుతున్నారు. ఎగుమతి కూడా తగ్గడంతో కొనుగోలు కేంద్రాల్లోనే బత్తాయి పండ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో రైతులు రోడ్డుబాట పట్టారు. సిటీలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా వివిధ వాహనాల్లో బత్తాయి పండ్లను తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.
రూ.8కే కిలో..
బత్తాయి ధర కిలోకు ప్రస్తుతం రూ.8 నుంచి రూ.12 లకు పడిపోయింది. గతేడాది ఇదే టైంకు రూ.25 నుంచి 30 వరకు ధర ఉన్నట్లు కొత్తపేట మార్కెట్‌కు బత్తాయి తీసుకొచ్చిన ఓ రైతు వాపోయాడు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా బత్తాయి సాగు చేస్తారు. వానాకాలం సీజన్ జూన్, జూలై నెలలో అత్యధికంగా 2 లక్షల టన్నులు, యాసంగిలో 40 వేల టన్నుల పంట వస్తోందని అంచనా. అయితే సాధారణ రోజుల్లో కిలో బత్తాయికి రూ.15 నుంచి రూ.20లు ఉండగా.. లాక్ డౌన్ కు ముందు కిలో రూ.35 నుంచి రూ.40 వరకు పెరిగింది. అయితే, మార్చి 22 జనతా కర్ఫ్యూ, 23 నుంచి లాక్ డౌన్ విధించిన కారణంగా దేశమంతా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించింది. దీంతో బత్తాయి ధర పడిపోయింది.
విమర్శలున్నాయి..
అయితే, ఎగుమతులు లేకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేని పంట కావడంతో బత్తాయి రైతులు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఢిల్లీ మార్కెట్‌కు బత్తాయి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్కడి మార్కెట్ మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బత్తాయి పండ్ల ద్వారా రోగనిరోధక శక్తి పెరిగుతుందని సీఎం కేసీఆర్ చెప్పినా.. బత్తాయి రైతులకు భరోసా కల్పించే చర్యలేవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదనే విమర్శలున్నాయి.