- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియాలో కష్టాలు పడుతున్న టెన్నిస్ ప్లేయర్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటానికి మెల్‌బోర్న్ వెళ్లిన భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ అక్కడ అష్టకష్టాలు పడుతున్నాడంటా. మెల్‌బోర్న్‌లో హోటల్ గదికే పరిమితం అయిన నగల్ కనీసం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సరైన సమయం లేదని వాపోతున్నాడు. రోజంతా హోటల్ గదికే పరిమితం అవుతున్న సుమిత్‌కు కేవలం 5 గంటలు మాత్రం గది నుంచి బయటకు రావడానికి అనుమతి ఇచ్చారు. దానిలో రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీన్, గంటన్నర జిమ్, గంట సేపు తినడానికి కేటాయిస్తే.. మిగిలిన అరగంట హోటల్ రూమ్ నుంచి కోర్టుకు వెళ్లి రావడానికే సరిపోతుందన్నాడు.
పైగా హోటల్‌లో సిబ్బంది అతడి పట్ల ప్రవర్తించే తీరు కూడా బాలేదని అంటున్నాడు. రూమ్ సర్వీస్ ఉండటం లేదని.. టాయిలెట్లు శుభ్రం చేసుకోవడం, దుప్పట్లు మార్చుకోవడం, గది శుభ్రం చేసుకోవడంతో సమయం సరిపోతుందని అంటున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ కోసం 15 చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేయగా.. దాంట్లో వచ్చిన వారిలోకొంత మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆ ఫ్లైట్లలో వచ్చిన వారినందరినీ కఠినమైన క్వారంటైన్‌కు పంపారు. సుమిత్ నగల్ ఆ ఫ్లైట్లలో రాకపోయినా.. క్వారంటైన్‌లో ఉంటున్నాడు.