- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు పుట్టినరోజుకు బొమ్మ కొనివ్వలేని తల్లి.. కానుకలు పంపిన నెటిజన్లు
దిశ, ఫీచర్స్ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ తల్లి తన కొడుకు పుట్టినరోజు కోసం ఒక స్టఫ్డ్ మంట రే బొమ్మను కొనివ్వలేక, హోంమేడ్ బొమ్మను మాత్రం తయారుచేసినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో నెటిజన్లు బోలెడన్నీ స్టఫ్డ్ బొమ్మలు పంపించి ఆ తల్లికొడుకులను ఆశ్చర్యపరిచారు.
తల్లిదండ్రులు తాము ఎంత కష్టపడుతున్నా, ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా తమ పిల్లలకు మాత్రం ఆ వెలితి రాకుండా చూసుకుంటారు. అమెరికాకు చెందిన ఓ ఒంటరి తల్లి కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోగా, కుటుంబం గడవటమే కష్టంగా మారింది. ఈ మేరకు తన బిడ్డ పుట్టినరోజు బహుమతిగా అడిగిన స్టఫ్డ్ మాంటా రే బొమ్మను కొనుగోలు చేయలేని స్థితిలో స్వయంగా తయారుచేసి తన కుమారుడిని ఆనందపరిచింది. పాత దుప్పటి, దిండు సాయంతో ఆ తల్లి తయారుచేసిన బొమ్మ ఆన్‌లైన్‌లో ప్రశంసలు అందుకుంది. ఈ విషయాలను ఆ తల్లి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్లు స్పందించి రకరకాల స్టఫ్ట్ టాయ్స్ ఆ తల్లికొడుకులకు పంపించారు.
దీంతో ఆ చిన్నోడు బొమ్మలతో సంతోషంగా ఆడుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘మీరంతా నా కొడుకు పుట్టినరోజును ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమకు మేం బానిసలం. ఆగస్టు 16న తన పుట్టినరోజును మీరిచ్చిన బొమ్మల సమక్షంలో గ్రాండ్‌గా చేసుకోబోతున్నాడు. ప్రతీ బొమ్మకు పేరు పెడుతూ.. వాటితోనే కలిసి పడుకుంటున్నాడు’ అని నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు ఆ మహిళ దగ్గర కుట్టు మెషిన్ లేదని తెలుసుకున్న నెటిజన్లు ఓ రెడిట్ వినియోగదారుడు ఆమెకు విరాళంగా ఇవ్వగా, ఆమె స్టఫ్డ్ బొమ్మలను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నెటిజన్లు సూచించారు.