- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పలు దేశాల్లో విడ్డూరం కలిగించే వింత హాబీలు
దిశ, వెబ్‌డెస్క్: మీ హాబీ ఏంటి? అని ఎవరైనా అడిగితే మొదటగా వచ్చే సమాధానం..సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం… అని చెప్పేస్తారు. నిజానికి ఇదేదో ఫార్మల్‌గా ఇచ్చిన ఆన్సర్‌లాగ అనిపిస్తుంది. అందుకే రొటీన్‌కు భిన్నంగా ఉండాలని కొందరు వింత వింత హాబీలు చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోతారు. ఎందుకంటే వింత హాబీలను ఫాలో చేయడం ఈరోజుల్లో కొద్దిగా కష్టం. మనకు కష్టమే కావొచ్చు. కానీ, కొందరికి మాత్రం ఇలా వింత హాబీలను అలవాటు చేసుకోవడం, వింత పనులు విభిన్నంగా చేయడం మీద చాలా ఆసక్తి ఉంటుంది. మరి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రజలకు ఉన్న కొన్ని వింత హాబీలేంటో తెలుసుకుందామా?
బొమ్మల ప్రయాణం
అవకాశం వస్తే ప్రపంచం మొత్తం చుట్టిరావాలని అందరికీ ఉంటుంది. చాలా మంది దీన్ని హాబీగా పెట్టుకుంటారు. అయితే బొమ్మలకు ప్రపంచాన్ని చుట్టే అవకాశాన్ని కల్పించాలనుకోవడం నిజంగా ఒక వింత హాబీ. ఈ హాబీని నిజం చేయడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. టాయ్‌వాయేజర్స్ అనే వెబ్‌సైట్ ద్వారా మీ బొమ్మను ప్రపంచంలో ఏ నగరానికి కావాలంటే ఆ నగరానికి పంపించి, అక్కడి దాని ఫొటోలను, జర్నీని పర్యవేక్షించవచ్చు.
దారుణ పరిస్థితుల్లో ఇస్త్రీ
బట్టలు ఇస్త్రీ చేయడం ఒక కళ. అయితే సాధారణ పరిస్థితుల్లో ఇస్త్రీ అందరూ చేయగలుగుతారు. కానీ దారుణ పరిస్థితుల్లో చేయగలగడం ఒక వింత హాబీ. దీని గురించి జర్మనీలో కాంపిటీషన్లు కూడా జరుగుతాయి. దారుణ పరిస్థితులు అంటే విమానంలో ప్రయాణిస్తూ, సముద్రపు అలల మీద తేలుతూ, పర్వతాల మీద, అగ్ని పర్వతాల దగ్గర ఇస్త్రీ చేయడం అన్నమాట. 1997లో లీచెస్టర్‌లో ఇలాంటి పోటీ మొదటగా ప్రారంభమైంది. ఇక అప్పట్నుంచి ఆసక్తి ఉన్నవాళ్లందరూ ఇలా అసాధారణ పరిస్థితుల్లో ఇస్త్రీ చేస్తూ పోటీలో గెలవడానికి దీన్ని ఒక హాబీగా మార్చుకున్నారు.
కుక్కకు కటింగ్
పెంచుకుంటున్న కుక్కలను ఇంటి మనుషులతో సమానంగా చూడటం చాలా మందికి ఒక హాబీ. కానీ అదే కుక్క వెంట్రుకలను వేర్వేరు స్టైల్‌లలో కత్తిరించి పోటీలకు పంపించడం వింత హాబీ. నెదర్లాండ్‌లో ఇలాంటి పోటీలు జరుగుతుంటాయి.
మూనింగ్
అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఒక వింత హాబీకి సంబంధించిన పోటీలు జరుగుతాయి. దాని పేరు మూనింగ్. అంటే ఆవు లాగ అరవడం. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్లు తమ ఆవులాగా అరవాలన్నమాట. గెలిచిన వారికి 1,000 డాలర్లు ప్రైజ్ మనీతో పాటు ఒక ఆవు ప్రింట్ జాకెట్, బంగారపు ఆవు గంటను బహుమతిగా ఇస్తారు.
ట్రైన్ సర్ఫింగ్
జర్మనీలో చాలా మంది ప్రయత్నించే ఒక ప్రమాదకరమైన హాబీ ఇది. కదులుతున్న ఉన్న ట్రైన్ నుంచి బయటికి దూకి, ఆ తర్వాత ఎవరినైనా లిఫ్ట్ అడిగి గమ్యస్థానం చేరుకోవాలన్నమాట. ఈ హాబీని ప్రయత్నించిన కారణంగా 2008లో అక్కడ 40 మంది చనిపోయారు.
వాహనాలకు టాటూ
శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకోవడం ఒక రకమైన వింత హాబీ. కానీ తన సొంత వాహనాలకు మొత్తంగా టాటూ వేయించడం పాలస్తీనాలో ఒక అరుదైన హాబీ. అక్కడి బెలాల్ ఖలీద్ అనే టాటూ ఆర్టిస్ట్, వాహనాల మీద బుద్ధిజం సూక్తులను టాటూలుగా వేస్తుంటాడు.
న్యూస్ బాంబింగ్
ఈ మధ్య వార్తాచానళ్లు, యూట్యూబ్ చానళ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రియలిస్టిక్ వోక్స్ టాక్ వీడియోలు తీసే చానళ్లు మైక్‌లు, కెమెరాలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటారు. అలాగే ఏదైనా పరిస్థితిని గురించి లైవ్ రిపోర్టింగ్ చేస్తూ టీవీ చానల్ బృందాలు కనిపిస్తుంటాయి. మన దగ్గర లేదు. కానీ..యూకే అయితే న్యూస్ బాంబింగ్ హాబీగా పెట్టుకున్న తుంటరిగాళ్లు చాలా మంది ఉంటారు. ఏదైనా న్యూస్ లైవ్‌లో చదువుతున్నప్పుడు, లేదా ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో తీస్తున్నప్పుడు వాళ్లు ఒక్కసారిగా వచ్చి డిస్ట్రబ్ చేస్తుంటారు.
బొడ్డులో గుజ్జు సేకరించడం
ఈ జాబితాలో అన్నిటికన్నా వింత హాబీ ఇదేనేమో అనిపిస్తోంది. సాధారణంగా బొడ్డులో లోపలి నుంచి కొంత మడ్డి, మురికి పేరుకుంటాయి. వాటిని స్నానం చేసేటపుడు శుభ్రం చేసుకుంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ బార్కర్ మాత్రం దాన్ని సేకరించి ఒక కవర్‌లో ప్యాక్ చేస్తాడు. 1984 నుంచి ఆయన ఇదే పనిని హాబీగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు 22.1 గ్రాముల బొడ్డు గుజ్జును గ్రాహమ్ సేకరించాడు. అయితే తన బొడ్డులో ఉండే మట్టిని మాత్రమేనండోయ్… అందరిదీ కాదు.
మత్తుగోలీల సేకరణ
2009లో ఓ వ్యక్తి నెదర్లాండ్ పోలీసులకు కాల్ చేసి, తన మత్తు గోలీలు పోయాయని ఫిర్యాదు చేశాడు. అక్కడ అవి నిషేధం అని తెలిసినా ఇలా ఫోన్ చేయడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వెళ్లి విచారణ చేస్తే ఆ వ్యక్తి తన వింత హాబీ గురించి చెప్పాడు. తాను మత్తు గోలీలు ఉపయోగించనని, కేవలం వాటిని సేకరించి దాచుకుంటానని చెప్పాడు. ఇప్పటివరకు దాదాపుగా 2,400 మత్తుగోలీలు కలెక్ట్ చేసినట్లు, అవి ఒక్కొక్కటి ఒక్కో రకానికి చెందినవని, చాలా ప్రమాదకరమైనవని చెప్పాడు.
సిక్ బ్యాగ్‌ల చోరీ
విమానంలో కడుపులో గడబిడగా అనిపించినపుడు వాంతులు చేసుకోవడానికి సిక్ బ్యాగ్‌లు ఇస్తుంటారు. వాటిని దొంగతనం చేయడం కూడా ఒక హాబీ పెట్టుకున్న వింత మనుషులు చాలా మందే ఉన్నారు. వారిని బ్యాగిస్ట్‌లు అని అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి బ్యాగిస్ట్‌ల దగ్గరి నుంచి ఈ సిక్ బ్యాగ్‌లను కొనే వెబ్‌సైట్‌లు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ఓ బ్యాగిస్ట్, 186 ఎయిర్‌లైన్‌లకు చెందిన 388 బ్యాగ్‌లను చోరీ చేశాడంటే ఈ హాబీ పాపులారిటీ చూడండి.
బగ్ ఫైటింగ్
జపాన్‌లో చాలా మందికి ఈ చాలా ఫేవరెట్ హాబీ. మనకు వింతగానే అనిపించవచ్చు. కానీ, అక్కడ బగ్ ఫైటింగ్ పోటీలు జరుగుతాయి. మన దగ్గర కోడి పందేల మాదిరిగా అక్కడ పురుగులను పట్టుకుని వాటిని పెంచి, ఫైటింగ్‌లు చేయిస్తారు. ఆ ఫైట్లను రికార్డు చేసి, ఆన్‌లైన్‌లో వీడియోలు పెడతారు.
ఫోర్క్ బెండింగ్
ఫోర్క్‌ను చేతితో కాకుండా మైండ్‌తో వంచడమే ఈ ఫోర్క్ బెండింగ్. అయితే అది సాధ్యం కాదనుకోండి.. కానీ తక్కువ ఒత్తిడి ఉపయోగించి, ఫోర్క్‌ను ఎక్కువ వంచగలగాలి. ఇందుకోసం చాలా ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీసులో భాగంగా చాలా మంది జపనీయులు ఈ హాబీని అలవాటు చేసుకుంటారు.
బేస్‌బాల్‌ను పెయింట్ చేయడం
1977లో అమెరికాలోని ఇండియానాకు చెందిన మైక్ కార్మైకేల్ బేస్‌బాల్‌ను పెయింట్ చేయాలనుకుంటున్నాడు. ఇక అప్పట్నుంచి దాన్ని ఒక హాబీలాగ అలవాటు చేసుకుని ఆ బాల్ మీద పెయింట్ వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ రూల్ ఏంటంటే..ప్రతి రంగు కొత్త రంగు అయ్యుండాలి. అంటే ఇంతకుముందు వేసిన రంగును మళ్లీ ఆ బాల్‌కు వేయొద్దు. ఈ లెక్కన ఇప్పటికి దాని మీద 22,894 పెయింట్ల పూత వేశాడు. దీంతో ఆ బాల్, 3500 పౌండ్ల బరువు గల పెద్ద బాల్‌గా మారింది. ఇప్పుడు ఈ బాల్ ఒక టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మారింది.
హికారు డొరొడాంగో
చిన్నప్పుడు బురద మట్టిలో ఆడుకునే సమయంలో అదే మట్టిని ముద్దలుగా చేసేవాళ్లం కదా..అదే ఈ వింత హాబీ. జపాన్‌లో సంప్రదాయబద్దంగా వస్తున్న హాబీ ఇది. పాశ్చాత్య దేశాల్లో ఉండే వారికి ఈ హాబీ చాలా వింతగా అనిపిస్తుంది.
సబ్బు మీద చిత్రాలు
థాయ్‌లాండ్‌లో ఇది చాలా కామన్ హాబీ. అందరూ స్నానం చేయడానికి సబ్బులు కొనుక్కుంటే థాయ్‌లాండ్ వాళ్లు మాత్రం వాటి మీద బొమ్మలు, డిజైన్‌లు చెక్కడానికి సబ్బులు కొనుక్కుంటారు. అంతేగాకుండా ఆ బొమ్మలు చెక్కిన సబ్బులను స్నేహితులకు బహుమతిగా ఇస్తుంటారు, మార్కెట్‌లో అమ్ముతుంటారు. మరి నీళ్లు పడితే ఆ సబ్బు డిజైన్ సంగతి ఏమవుతుందో మరి!