- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫైనాన్స్’.. ఇదేం నాన్సెన్స్?
దిశ, కరీంనగర్: హైర్ పర్చేజ్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలు వేలంలో తక్కువ ధరకే వస్తున్నాయని సంబరపడి కొనేవాళ్లకు కొత్త సమస్య వస్తోందా ? ఫైనాన్స్ కంపెనీయే ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి మరి అమ్ముతోంది కదా! నా పేరిట ట్రాన్స్‌ఫర్ కావడం లేదని కలత చెందుతున్నారా? అసలు మోటారు వాహన చట్టం ఏం చెబుతోంది. హైర్ పర్చేజ్ కంపెనీలు ఏం చేస్తున్నాయి? సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్‌స్టాల్ మెంట్ పద్ధతిలో రుణం తీసుకునేందుకు కామన్ పీపుల్ సాహసిస్తారు. మంత్లీ ఇన్‌స్టాల్ మెంట్ ఈజీ పద్దతి అని నమ్మి లోన్ ద్వారానే వాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే అనివార్య పరిస్థితుల్లో ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలు కట్టలేకపోతే ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు దాన్ని సీజ్ చేస్తారు. ఆ తరువాత బహిరంగ వేలం ద్వారా ఇతరులకు అమ్మేస్తారు. కానీ ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైనాన్స్ కంపెనీలు చాలా వరకు అలా చేయట్లేదు. చేతికి వాహనం చిక్కింది కదా దాన్ని అమ్మేసి మిగతా డబ్బు రికవరీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో అసలు తిరకాసు ఇక్కడే మొదలవుతోంది.
ఫైనాన్స్ కంపెనీ వాహనాన్ని సీజ్ చేసిన తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఎఫ్.ఆర్.సి) తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్.ఆర్.సి తీసుకోవాలంటే ముందుగా ఫైనాన్స్ కంపెనీ సంబంధిత ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇచ్చి ఒక్కో వాహనానికి రూ.2వేలు వరకు చెల్లించాలి. ఆ తర్వాత మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ ఫిజికల్‌గా వెల్లి సీజ్ అయిన వాహనాన్ని పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. అయితే ఈ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఫైనాన్స్ కంపెనీ నిబంధనల ప్రకారం లోన్ తీసుకున్న వారికి నోటీసులు ఇచ్చారా? ఆ వ్యక్తి ఎన్ని వాయిదాలు చెల్లించలేదు? ష్యూరిటీల నుండి బకాయిపడ్డ ఇన్‌స్టాల్ మెంట్ ఎందుకు వసూలు చేయలేదు అన్న విషయాలపై సమగ్రంగా ఆరా తీస్తారు. ఫైనాన్స్ కంపెనీ చెప్పిన విషయాలు, చూపిన ఆధారాలు సరైనవే అనుకున్న తరువాత ఎఫ్.ఆర్.సి జారీ చేస్తారు. ఆ తర్వాత వేలం ద్వారా వాహనాలను అమ్ముకునే హక్కు కంపెనీకి ఉంటుంది. అప్పటివరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో వాహనం ఓనర్ పేరు, ఫైనాన్స్‌డ్ బై ఫలానా కంపెనీ అని రాసి ఉంటుంది. ఎప్పుడయితే ఎంవీఐ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారో ఆ వాహనం ఫైనాన్స్ కంపెనీకి చెందినదిగా అధికారికంగా చెల్లుబాటు అవుతుంది.
కానీ ఫైనాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేప్పుడు తీసుకునే జాగ్రత్తలు, నిబంధనలు అమలుచేసేప్పుడు వ్యవహరించే తీరుకు పొంతన లేకుండా పోతుంది. అప్పు ఇచ్చామన్న సాకుతో ఇష్టానుసారంగా వ్యవహరించి ఏకంగా సీజింగ్ కోసమే ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని నెలల తరువాత కస్టమర్‌కు నోటీసు ఇవ్వకుండానే దర్జాగా అమ్మేస్తున్నాయి. అయితే సెకండ్ హైండ్ వాహనాలే అయినా తక్కువ ధరకే వస్తున్నాయన్న ఆనందంతో చాలా మంది ఆయా ఫైనాన్స్ కంపెనీలు నిర్వహించే వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు ఇచ్చే 29, 30ఫామ్స్ పై కూడా ఫైనాన్స్ ప్రతినిధులు సంతకాలు చేసి స్టాంప్ వేసి ఇస్తుండడంతో కార్పొరేట్ కంపెనీలు తప్పు చేయవు కదా అన్న నమ్మకంతో డబ్బు చెల్లించి మరీ వాహనాలను తీసుకుంటున్నారు.
2009 ఎంవీ చట్టం ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను నియంత్రించే విధంగా ఉన్నా అసలు విషయం తెలియక సామాన్యుడు వేలంలో వాహనాలు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. అయితే కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన 29, 30 ఫామ్స్ తీసుకుని ఆర్టీఏ ఆఫీస్‌కు వెలితే ఓనర్ పేరును మార్పునకు ససేమిరా అంటున్నారు. కొత్తగా వచ్చిన నిబంధనలతో వాహనం రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి వచ్చి ఫోటో దిగడంతో పాటు వేలిముద్రలు ఇవ్వాల్సిన పరిస్థితి తయారైంది. అయితే ఫైనాన్స్ కంపెనీలు ప్రొసీజర్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేయకపోవడం, వేలంలో అమ్మకాలు నిర్వహించడంతో వాటిని కొన్న వారు ఇక్కట్లు పడుతున్నారు. అమ్మిన కంపెనీలు మీ పేరిట బదిలీ చేసేందుకు అన్ని రకాలుగా డాక్యుమెంట్లు ఇచ్చాం కదా అని అంటున్నాయి. ఆర్టీఏ అధికారులు మాత్రం ఫైనాన్స్ చేసిన కంపెనీతో పాటు వెహికిల్ రిజిస్ట్రేషన్ హోల్డర్ కావాలంటున్నారు. చివరకు బ్రోకర్లను ఆశ్రయించి తమ పేరిట వాహనాలను మార్చుకుంటున్న వారు కోకొల్లలు. గత 11 ఏళ్లుగా ఈ తంతు నిర్వహించేందుకు కొన్ని ఆర్టీఏ ఆఫీస్‌లు పెట్టింది పేరుగా మారిపోయాయి. కావల్సిన అదనపు సర్దుబాటు చేస్తే మిగతావన్ని సక్రమంగా సాగుతున్నాయి. మొదట ఫైనాన్స్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే, డామిట్ కథ అడ్డం తిరిగేందే అన్నట్టుగానే తయారు కానుంది. ఇలా కొన్ని ఆర్టీఏ ఆఫీస్‌ల్లో ఇబ్బందులు ఎదురైన ఘటనలు కూడా లేకపోలేదు. గత 11 ఏళ్లలో ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేసిన వాహనాల్లో 10 శాతం వెహికిల్స్ కూడా నిబంధనల ప్రకారం వేలం జరగలేదని ఓ అంచనా.
హైర్ పర్చేజ్ ఫైనాన్స్ కంపెనీలూ బోగసేనా..?
హైర్ పర్చేజ్ కంపెనీ స్టాంప్ సంతకం ఉంటే చాలు ఆర్టీఏ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు రెడీ అయిపోతున్నాయి. ఆ కంపెనీ రిజిస్టర్డా కాదా? నిబంధనల ప్రకారం కంపెనీలు ఏర్పాటు అయ్యాయా లేదా అన్న విషయం దేవుడెరుగు. స్టాంప్, సంతకం ఉంటే చాలని చూస్తున్నారు చాలా మంది ఆర్టీఏ అధికారులు. అన్నీ సక్రమంగా ఉన్నాయి కదా ఆ విషయంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చి వడ్డీ, చక్రవడ్డీ, చెక్ బౌన్స్ పేరిట వినియోగదారున్ని నిలువు దోపిడి చేస్తున్నాయి. ఆ తరువాత వెహికిల్ సీజ్ చేసి మళ్లీ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
tags : Finance Companies, Vehicle, RTO Offices, 2009 Motor Vehicle Act, Interest, Check Bounce, Telangana