సమాజం చూస్తోంది..జాగ్రత్త!

by Shamantha N |
సమాజం చూస్తోంది..జాగ్రత్త!
X

ఒక ఎన్‌కౌంటర్..రెండు ఉరి శిక్షలు! ఆ మూడు ఉదంతాలకు పాఠం నేర్పాయి! మరణ శాసనం రాశాయి. సమాజాన్నికొద్దో గొప్పో శాంతింపజేశాయి. ఎటువంటి మూగ జీవాలతో పోల్చతగని ఆ మానవ మృగాలకు చావును పరిచయం చేశాయి. హాజీపూర్, చటాన్‌పల్లి, ఆసిఫాబాద్‌లలో అవాంఛనీయాలు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణ మనుషుల్ని, మనసుల్నీ తీవ్రంగా గాయపరిచాయి. ఆ వేదన, చంపేయాలన్న వాదన ఎల్లలు దాటింది. ఢిల్లీ నిర్భయలా దేశాన్నీ కలిచివేసింది, కదిలించింది. ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని అశాంతిలో పడేసింది. తమ ఇంటి బిడ్డల మాదిరిగా ప్రతి ఒక్క ఇల్లూ తల్లడిల్లింది. గల్లీ జనం మొదలు గవర్నరు దాకా కన్నీళ్లు ఉబికొచ్చాయి. నరరూప రాక్షసులకు భూమ్మీద తావు ఉండొద్దని పబ్లిక్ భీష్మించింది. ఊరూ వాడా కదం తొక్కింది. వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఆ నలుగురికి డిసెంబరు 5నే నూకలు చెల్లాయి. ఆసిఫాబాద్ అక్యూసుడ్స్ ముగ్గురికి జనవరి 30న ఉరి శిక్ష పడింది. ఆ జడ్జిమెంటు తర్వాత వారంలోనే హాజీపూర్ సైకో కిల్లర్‌కూ కోర్టు మరణ దండన విధించింది. ఏవైతే మ్యాగ్జిమమ్ అలజడి, ఆందోళన రేపాయో ఆ మూడు కేసుల్లోనూ ఉన్మాదులకు మొత్తానికి మూడింది. టోటల్ ఎనమండుగురిలో ఇప్పటికే సగం మంది మట్టికరిచారు. కడమ నలుగురికి పనిష్మెంట్ అమలు కావాల్సి వుంది. యువతులు, బాలికలు అత్యంత దారుణంగా హత్యాచారాలతో లోకం వీడినపుడు..తమ ఇంటి విషాధంగా సొసైటీ భావించింది. అదే విధంగా ఎన్‌కౌంటర్ జరిగినపుడూ తమ ఇంట్లోని సంతోషంగానే ఫీలైంది. యథార్థానికి చెప్పాలంటే, ప్రభుత్వాల్లోనూ, వ్యవస్థల్లోనూ సమాజమే చలనం తెచ్చింది! ఢిల్లీ నిర్భయ దోషుల ఉరితీత వాయిదాలు మనకాడ ఉండకుండా..వీలైనంత త్వరగా కానిచ్చేయాలని కోరుకుంటున్నది. అపుడే అసలైన మనశ్శాంతిగా చెబుతున్నది.

Advertisement

Next Story