- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
విద్యాసంస్థలకు నిలిచిన విద్యుత్ సరఫరా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: సర్కారు విద్యాసంస్థల్లో చదువులకు కరెంట్ కష్టాలు తప్పేలా కనిపిచడం లేదు. మరో వారం రోజుల్లో విద్యాసంస్థలు తెరిచే సమయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే ఉపాధ్యాయులు చీకట్లోనే పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇందుకు కారణం ప్రీపెయిడ్ మీటర్లు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు ఉత్తర మండల విద్యుత్ పంపిణీకి బకాయి పడడమే..
నిలిచిన కరెంట్సరఫరా
సర్కారు పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌తో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉత్తర మండల విద్యుత్‌పంపిణీ సంస్థ ప్రీ పెయిడ్ మీటర్లు బిగించింది. కొన్ని నెలలుగా రూ. కోట్లలో బకాయి పేరుకుపోవడంతో కరెంట్సరఫరా నిలిచిపోయింది. గడిచిన ఏడాది లాక్ డౌన్ వరకు అన్ని విద్యా సంస్థలకు విద్యుత్‌సరఫరా జరిగింది. లాక్‌డౌన్ తరువాత విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఆన్‌లాక్ డౌన్‌లో తెరిచిన పాఠశాలలో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరు కావడం.. కొంత మంది టీచర్లు సైతం ఇంటి నుంచే విద్యార్థులకు బోధన చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తం అవుతుండడంతో సంబంధిత అధికారులకు కరెంట్కష్టాలు గుర్తుకు వచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.2.5 కోట్ల బకాయిలు
ప్రభుత్వ రంగ సంస్థల్లో బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు ఎన్పీడీసీఎల్ ప్రీపెయిడ్ మీటర్లను బిగిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో సుమారు వెయ్యి, కామారెడ్డిలో 982 ప్రీపెయిడ్ మీటర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి విద్యాసంస్థల్లో ఏడో కేటగిరీ కింద 2,207 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, రూ. 2.5 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. సాధారణ విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలంటే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రీపెయిడ్ మీటరు అయితే ఎలాంటి సంబంధం లేకుండా విద్యుత్ వినియోగం ప్రకారం రీచార్జి పూర్తవగానే ఆటోమేటిక్‌గా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. కరోనా వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరిగిన చోట ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్ల కారణంగా విద్యుత్ సరఫరా అవసరం లేకపోవడంతో రీచార్జీలను చేయలేక కరెంట్సరఫరా నిలిచిపోతుంది.
సరాఫరా చేయాలని విద్యాశాఖ లేఖ
దాదాపు పది నెలల తరువాత విద్యాసంస్థలు తెరుచుకుంటున్న నేపథ్యంలో విద్యాశాఖాధికారులు పరిసరాల పరిశుభ్రతతో పాటు శానిటైజేషన్ పనులు చేపట్టారు. విద్యార్థులు తరగతులకు హాజరు కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనిలో పడ్డారు. అందులో భాగంగా విద్యాశాఖాధికారులు బడులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఎన్పీడీసీఎల్కు విద్యాశాఖాధికారులకు లేఖలు రాశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యుత్ శాఖాధికారులు బకాయిల వసూళ్లు, విద్యా సంస్థలకు తిరిగి కనెక్షన్లు ఇవ్వడం, ప్రీ పెయిడ్మీటర్ల రీచార్జీల విషయంలో చేపట్టాల్సిన చర్యల విషయమై వరంగల్ లోని ఎన్పీడీసీఎల్సీఎండీ కార్యాలయాలనికి సమాచారం ఇచ్చారు. అక్కడి అధికారుల ఆదేశాల మేరకు సర్కారు బడులకు విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని జిల్లా విద్యుత్ శాఖాధికారులు తెలుపుతున్నారు.