వంద కిలోల పేడ చోరీ..

by Shamantha N |   ( Updated:2020-08-09 12:27:19.0  )
వంద కిలోల పేడ చోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా బంగారం లేదా, డబ్బులు దొంగతనం చేయడం చూస్తుంటాం. కానీ ఓ చోట వింతగా 100 కేజీల ఆవు పేడ దొంగతనం చేశారు. ఈ ఘటన చత్తీస్‌గడ్ కొరియా జిల్లాలోని రోజి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పశుసంపదను ప్రోత్సహించడానికి కిలో ఆవు పేడను రూ.2 చొప్పున సేకరించే లక్ష్యంతో భూపేష్ బాగెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు.

లల్లా రామ్, సెమ్ లాల్ అనే ఇద్దరు రైతులు ప్రభుత్వానికి విక్రయించడానికి 100 కిలోల ఆవు పేడను సేకరించారు. అయితే పేడ కనిపించకపోవడంతో స్థానిక గౌతన్ సమితి (పశువుల షెడ్ ప్రాంగణాన్ని నిర్వహించే సంస్థ) కు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు చేరేలోపు సమస్య స్నేహపూర్వకంగా పరిష్కరించినట్టు కొరియా జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంగీత లక్రా అన్నారు.కాగా కొత్త పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5 న రూ .1.65 కోట్లను 46000 పశువుల యజమానుల ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పశువుల పేడకు ఆర్థిక విలువను చేకూరింది.

Advertisement

Next Story