- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోకేష్ అలా చేయడం బాధాకరం: వాసిరెడ్డి పద్మ
దిశ, ఏపీ బ్యూరో: దిశ చట్టం ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న దిశ చట్టాన్ని దేశమంతా అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫాలితాలు ఇస్తున్నాయన్నారు. దిశచట్టం విషయంలో నారా లోకేశ్ దిశ పేపర్లను చింపి కాల్చివేయడం బాధాకరమన్నారు. మహిళలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దిశ చట్టం, సోషల్ మీడియా వంటి అంశాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు ప్రతీ ఒక్కరూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆడవారు బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మెుబైల్ తీసుకువెళ్లాలని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు.