- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. అమాంతం పెరిగిన కొత్త కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. కొత్తగా.. 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయి. మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్ 406, మహబూబ్‌నగర్ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.