నేటి నుంచి జిల్లాలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన

by srinivas |
Nimmagadda-Ramesh-Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో నేటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ రమేష్ పర్యటించనున్నారు. నేటి నుంచి వరుసగా మూడు రోజులు 13 జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణపై ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

తొలి రోజు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశం కానున్నారు. ఆదివారం విజయవాడలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు. అ తర్వాత మార్చి 1వ తేదీన విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం గంటపాటు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు.

Advertisement

Next Story