పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలేంటీ?

by Shyam |
పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలేంటీ?
X

దిశ, నిజామాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం పిల్లల సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలు..వారిపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, అంగన్వాడీల్లో పిల్లలకు సమకూర్చే వసతుల గురించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ రాగజ్యోతి ఆరా తీశారు.మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో బాలల పరిరక్షణ, బాల కార్మికులు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, అంగన్వాడీ సేవలు, చైల్డ్ హెల్ప్ లైన్ ఫ్రీ నంబర్ 1098, రైల్వే చైల్డ్ లైన్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సంక్షేమానికి నిర్వహిస్తున్న పథకాలు ఏ మేరకు అమలు అవుతున్నాయి, బాలల పరిరక్షణ జిల్లాలు, మండలాల్లో ఏ విధంగా జరుగుతున్నదనే అంశంపై చర్చించారు. అదేవిధంగా పిల్లలపైన జరుగుతున్న లైంగిక వేధింపులు, అంగన్వాడీల్లో పిల్లలకు సమకూర్చే వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఇంకా ఏమైనా వసతులు అవసరమైనట్లైతే, వాటిని సమకూరుస్తామని రాగజ్యోతి స్పష్టంచేశారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ లక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ తారాచంద్ నాయక్, జిల్లా సీడీపీవోలు, డీసీపీవోలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిని, జాయింట్ కలెక్టర్ బిఎస్ లతను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Next Story