కరోనా కలకలం: హాస్పిటల్స్ గా మారిన ఫైవ్ స్టార్ హోటళ్లు

by Anukaran |   ( Updated:2021-04-15 02:28:14.0  )
కరోనా కలకలం: హాస్పిటల్స్ గా మారిన ఫైవ్ స్టార్ హోటళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా ఉధృతి మాములుగా లేదు. రోజురోజుకు కరోనా కేసులు లక్షలు దాటుతున్నాయి. ఆసుపత్రిలో శవాలు గుట్టలు గుట్టలుగా చేరుతున్నాయి. కరోనా పేషంట్లకు బెడ్ లు కూడా దొరకని పరిస్థితి. ముంబై లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కరోనా కేసులు ఎక్కువ కావడంతో అధికారులు ఫైవ్ స్టార్ హోటళ్లను తాత్కాలిక కరోనా హాస్పిటల్స్ గా మార్చేస్తున్నారు. చిన్నపాటి లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించడానికి ముంబాయి ఆసుపత్రులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లను ఉపయోగించుకోనున్నట్లు ముంబాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనివల్ల ఎక్కువ మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. అత్యవసర చికిత్స అవసరమున్న పేషంట్లకు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అందించనునట్లు తెలిపింది. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించి కరోనా కట్టడికి సహాయపడాలని ప్రజలను కోరింది.

Advertisement

Next Story

Most Viewed