- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 10 వేల కోట్ల బీమా ప్రీమియం లక్ష్యం: స్టార్ హెల్త్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ రూ. 10,000 కోట్ల ప్రీమియం వసూలు చేయాలని లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం బీమా సంస్థ ఏడాదికి 45 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సంస్థ స్థూల ప్రత్యక్ష ప్రీమియం సుమారు రూ. 5,600 కోట్లను సాధించింది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం 30 లక్షల పాలసీలతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 43 లక్షల పాలసీలను విక్రయించింది.
‘గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 6,865 కోట్ల వ్యాపారాన్ని సంస్థ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం దాన్ని రూ. 10 వేల కోట్ల ప్రీమియం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. కరోనా మహమ్మారి తర్వాత గత కొన్ని నెలలుగా ఆరోగ్య బీమా కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను తాము సద్వినియోగం చేసుకున్నాము. ప్రస్తుతం వార్షిక వృద్ధి 45 శాతం ఉన్న నేపథ్యంలో భావిష్యత్తులో దీన్ని మరింత పెంచే ప్రణాళికను సిద్ధం చేస్తాం’ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ రాయ్ చెప్పారు. భారత్‌లోని మొత్తం ఆరోగ్య బీమా విభాగంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 15 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. సంస్థ ప్రధాన విభాగమైన రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 30 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉందని ఆనంద్ పేర్కొన్నారు.