ఇంట్లోనే శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలి

by Shyam |
ఇంట్లోనే శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలి
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రసిద్ధ చెందిన కోదండ రాముని ఆలయంలో ప్రతి ఏటా గ్రామ ప్రజల సమక్షంలో వైభవంగా నిర్వహించే, సీతారాముల కళ్యాణ ఉత్సవాలను రద్దు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనాతో కర్ఫ్యూ విధించడం అందరికీ తెలిసిందే. ఇందుకుగాను ఈ సంవత్సరం ఊరిలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరపడం లేదని తెలిపారు. అందరి క్షేమం స్వామి వారి కళ్యాణం అర్చకులు, ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు కలిసి గుడిలోనే జరిపిస్తున్నారని తెలిపారు. కావున నవమి నాడు ఉదయం 11 గంటలకు ఇంట్లోనే ఉండి పూజలు జరుపుకోవాలని జిన్నారం గ్రామ ప్రజలను కోరుచున్నట్టు రామాలయ కమిటీ చైర్మన్ బి.బోజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Tags: Sriramanavami, celebrations, home, medak, sangareddy

Advertisement

Next Story