- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి ఆరోపించారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో టీటీడీ ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చిందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో శనివారం మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ ధార్మిక సంస్థలా కాకుండా వ్యాపార సంస్థలా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. శాస్త్రానికి విరుద్ధంగా టీటీడీ అగరబత్తుల వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు టీటీడీనీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలా మార్చేశారంటూ విరుచుకుపడ్డారు. శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి హిందువుల డబ్బులు ఇస్తుందని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి ఆరోపించారు.