- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 లక్షల అప్పుకు.. వడ్డీ ఏకంగా రూ.48 లక్షలు.. వేధింపులు తాళలేక..!
దిశ, వెబ్‌డెస్క్ : అప్పు ఇచ్చిన వ్యక్తి దానికి నాలుగింతల వడ్డీ కట్టాలని తీవ్ర వేధింపులకు గురిచేశాడు. చివరకు అప్పు తీసుకున్న వ్యక్తికి చెందిన సొంతింటిని తన పేరు మీద రాయించుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 12లక్షలు అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్.. అసలు మొత్తానికి రూ.48 లక్షల వడ్డీ చూపించాడు. ఆ మొత్తాన్ని చెల్లించాలని ఫైనాన్షియర్ తీవ్ర ఒత్తిడికి గురిచేశాడు. చివరకు శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఉన్న ఇంటిని తనపేరు మీద రాయించుకున్నాడు. వేధింపులతో పాటు అవమాన భారం భరించలేక శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబం వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.